
దేశ సంస్కృతిని చాటిన యోగా
ఆదిలాబాద్‌రూరల్: యోగా భారతదేశ సంస్కృతి, కీర్తిని ప్రపంచమంతా గొప్పగా చాటిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మా వల మండలంలోని రత్న గార్డెన్‌లో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి యోగాసన ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాల ని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి, లాలాము న్నా, చిట్యాల సుహాసినీరెడ్డి, దయాకర్, వివిధ జిల్లాల యోగా టీచర్లు పాల్గొన్నారు.