
పోక్సో కేసు ఎత్తి వేయాలి
తాంసి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గీతేశ్‌పై పోక్సో కేసు ఎత్తి వేయాలని పాఠశాల విద్యార్థులు గురువారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గీతేశ్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదు మేరకు మంగళవారం అతడిపై పోక్సో కేసు నమోదు చేసిన తాంసి పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యార్థులు ‘మా తెలుగు సార్ మాకే కావాలి’ అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుడు గీతేశ్ ఎలాంటి తప్పు చేయలేదని, వెంటనే కేసు ఎత్తి వేయాలని కోరారు.