
‘రాఖీ’ సందడి
ఆదిలాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ సందడి జిల్లాలో మొదలైంది. ఈ నెల 9వ రాఖీ పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతోంది. దస్నాపూర్, కలెక్టరేట్ చౌక్, వినాయక చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, రైతు బజార్ ఏరియా, రద్దీగా ఉండే వి విధ ప్రాంతాల్లోనూ రాఖీ దుకాణాలు వెలిశాయి. వి విధ డిజైన్లలో రూ.10 నుంచి రూ.500 ధర కలిగిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ దూది బొండాలతో పాటు లాకెట్, రుద్రాక్ష, ము త్యాలు, రంగుల రాళ్లు, జరీ రాఖీలు ఎక్కువగా అ మ్ముడుపోతున్నాయి. చిన్నారులు మెచ్చేలా కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా ని లుస్తున్నాయి. కాగా, పలువురు వెండి, బంగారు రాఖీల కోసం స్వర్ణకారులకు ఆర్డర్లు ఇస్తున్నారు.