
వర్షాభావమే..
సాక్షి, ఆదిలాబాద్: వరుణుడు ముఖం చాటేశాడు. ఈ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యి. అసలుకే వర్షాలు లేక ఎదుగుతున్న, పూత, కాత కాస్తున్న పంటలను చూసి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతి ఉన్నవారు ఏదో రకంగా పంటలకు తడులు అందిస్తున్నారు. నీటి వసతిలేని రైతులు బిక్కచూపులు చూస్తున్నారు. సరైన సమయంలో పంటలకు నీటి తడులు అందక దిగుబడులపై దిగులు చెందుతున్నారు.
లోటు దిశగా..
జిల్లాలో ఈ వానాకాలం సరైన వర్షాలు కురవలేదు. జూన్ రెండో వారంలోనే మంచి వర్షాలు కురిశాయి. మిగతా మూడు వారాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూలై మొదటి, రెండో వారంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. అయితే మూ డు, నాలుగో వారాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులోనైతే ఇప్పటికీ తీవ్ర వర్షాభావమే కనిపిస్తోంది. మొత్తంగా ఈ వానాకాలం మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు 36 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. ఇందులో భారీ వర్షాలు అసలే లేవు. దీంతో ఇప్పటికీ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు.
మండలాల వారీగా పరిస్థితి
జిల్లాలో 13 మండలాల్లో సాధారణ వర్షపాతం న మోదు కాగా, ఎనిమిది మండలాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. భీంపూర్, జైనథ్, బేల, నా ర్నూర్, భోరజ్, తాంసి, తలమడుగు, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్‌రూర ల్, ఆదిలాబాద్‌అర్బన్, సాత్నాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. సొనాల, నేరడిగొండ, బోథ్, గాదిగూడ, ఉట్నూర్, మావల, సిరికొండ, ఇంద్రవెల్లిలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో ముఖం చాటేసిన వర్షాలు
పూత, కాత దశలో సోయా పంట
స్ప్రింక్లర్లతో నీటిని అందిస్తున్న వైనం
ఆందోళనలో నీటి వసతిలేని రైతులు
జిల్లాలో వర్షపాతం వివరాలు
(జూన్ 1నుంచి ఆగస్టు 7 వరకు)
సాధారణం 618.1 మి.మీ.లు
కురిసింది 499.7 మి.మీ.లు
వ్యత్యాసం 19 శాతం తక్కువ
ఈ రైతు పేరు సోమ ప్రవీణ్‌రెడ్డి. తాంసి శివారులో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తొమ్మిదెకరాల్లో పత్తి, అంతర పంటగా కంది, మూడెకరాల్లో సోయాబీన్ సాగు చేశాడు. పత్తి పంట ఎదిగే దశలో ఉండగా సోయా పూత, కాత దశకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో సోయా పంటకు నీటి తడులు అందించాల్సి ఉండగా వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో బోర్ల ద్వారా స్ప్రింక్లర్లకు పనిచెప్పాడు. ఈ విధానంలో మూడెకరాల్లోని సోయా పంటకు నీటిని అందిస్తున్నాడు.

వర్షాభావమే..