అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Aug 8 2025 7:31 AM | Updated on Aug 8 2025 7:31 AM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

● కలెక్టర్‌ రాజర్షి షా ● కొత్త రేషన్‌కార్డుల పంపిణీ

తలమడుగు: అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫ లాలు అందించనున్నట్లు కలెక్టర్‌ రాజార్షి షా పేర్కొన్నారు. గురువారం మండలంలోని సుంకిడి గ్రామ రైతువేదికలో తాంసి, తలమడుగు మండలాల లబ్ధి దారులకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. అ నంతరం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సుంకిడి జిల్లా పరిషత్‌ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా బోథ్‌ నియోజకవర్గ ఆత్మ చైర్మన్‌ అశోక్‌ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి జరుగుతోందని చెబుతుండగా బీఆర్‌ఎస్‌ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ అంశంపై ఎమ్మెల్యే, డీసీసీబీ చై ర్మన్‌ ఆడ్డి బోజారెడ్డి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ జోక్యం చేసుకుని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను సము దాయించగా గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తాంసి, తలమడుగు తహసీల్దా ర్లు లక్ష్మి, రాజ్‌మోహన్‌, ఎంపీడీవో శంకర్‌, ఝరి పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, కేదారేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్‌, వామన్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

ఆదిలాబాద్‌టౌన్‌: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. ప్ర భుత్వ డైట్‌ కళాశాలలో గురువారం ఉల్లాస్‌ నవభా రత్‌ సాక్షరత జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలవారు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి నిరక్షరాస్యుల వివరాలు సేకరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఆర్పీలు వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపా రు. జిల్లాలో 1,192 మంది వలంటీర్లు చదువు చె ప్పేందుకు యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పే ర్కొన్నారు. వీరు 26,312 మందికి చదువు నేర్పించాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శా తం 66 ఉందని, వంద శాతానికి చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement