
హాజరుశాతం పెంచాలి
తాంసి: విద్యార్థుల హాజరుశాతం పెంచాలని డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ కళా శాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆవరణ, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రవేశాల సంఖ్య తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై మాట్లాడారు. సిలబస్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్ర తీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలి పారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చే యాలని ఆదేశించారు. డీఐఈవో వెంట ప్రిన్సి పాల్ సుదర్శన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సంతోష్, అధ్యాపకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రమణ, దేవేందర్, సిబ్బంది ఉన్నారు.