
ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి
ఆదిలాబాద్‌టౌన్: ఈ నెల 11న జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నులిపురుగులతో విద్యార్థుల్లో ఎదుగుదల లోపిస్తుందని, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
నులిపురుగుల నిర్మూలనే ధ్యేయం
నులిపురుగుల నిర్మూలనే ధ్యేయమని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పుత్లీబౌళి పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ఈ నెల 11న జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.