
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాల వి ద్యార్థులు జనగాం వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జావెలిన్‌త్రో పోటీల్లో సత్తా చాటారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబరిచిన వీ దీక్షిత బంగారు, ఎం.హన్మంతు రజత పతకాలు సా ధించినట్లు కోచ్ రమేశ్ తెలిపారు. వీరిని డీవైఎస్వో శ్రీనివాస్ అభినందించారు.
బజార్‌హత్నూర్: ఈ నెల 5, 6 తేదీల్లో భైంసా పట్టణంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఖోఖో అండర్–11 విభాగంలో మండల కేంద్రంలోని సరస్వతీ శి శుమందిర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతి భ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. క్రీడాకారులను గురువారం ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, పాఠశాల ప్రబంధకారిణి స భ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో కీటకజనిత వ్యా ధుల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. బ్రీడింగ్ చెక్కర్స్ ఆయా కాలనీల్లో పర్యవేక్షించాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలని సూచించారు. నీటి నిల్వతో డెంగీ, మలేరియా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ