
జయశంకర్‌కు ఘన నివాళి
కై లాస్‌నగర్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బుధవారం అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్రను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, డీబీసీడబ్ల్యూవో కె.రాజలింగు, డీసీవో మోహన్, విశ్వబ్రాహ్మణ సంఘ బాధ్యులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ కార్యాలయంలో నివాళులర్పించిన పీవో
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పీవో ఖుష్బూ గుప్తా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఇందులో ఏపీవో మెస్రం మనోహర్, అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఈఈ తానాజీ, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రజట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా జాదవ్ రవీందర్
ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్న జాదవ్ రవీందర్ రాష్ట్ర జూనియర్ హాకీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈనెల 12నుంచి పంజాబ్‌లోని జలంధర్‌లో నిర్వహించనున్న జాతీయ జూనియర్ హాకీ పోటీల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్న జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించనున్నారు. ఈమేరకు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

జయశంకర్‌కు ఘన నివాళి