
వర్సిటీ ఏర్పాటు చేసే దాకా పోరు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సి టీ ఏర్పాటు చేసేంత వరకు పోరాడుతామని యూ నివర్సిటీ సాధన సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ ఆవశ్యకతపై విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులు విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విశ్వవిద్యాలయ సాధన కో సం పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి రావాలని కోరారు. త్వరలో భారీ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఇందులో యూనివర్సిటీ సాధన సమితి సభ్యులు చిట్యాల సుహాసినిరెడ్డి, నరేందర్, ఉదారి నారాయణ, సాత్వి క్ రెడ్డి, సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, లెక్చరర్లు సంతోష్‌కుమార్, మంజుల, రాజ్‌కుమార్, సంజీవ్, స్రవంతి, జ్యోత్స్న, పాల్గొన్నారు.