
వేగ నియంత్రణకు పోలీస్ కటౌట్లు
● జాతీయ రహదారిపై రెండు చోట్ల ఏర్పాటు ● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: జాతీయ రహదారిపై వేగాన్ని ని యంత్రించేందుకు, రోడ్డు ప్రమాదాలు అరికట్టడాని కి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కటౌట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జా తీయ రహదారిపై హాట్‌స్పాట్‌ల వద్ద పోలీసు వా హనం, ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో కూడిన కటౌట్లు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, నేరడిగొండ మండలం బంధ ం ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని చూసి వాహనదారులు బ్రేక్‌లు వేస్తున్నార ని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారని తెలిపారు.
ఆదివాసీ దినోత్సవానికి ఆహ్వానం
ఈనెల 9న నిర్వహించే ఆదివాసీ దినోత్సవానికి హాజరు కావాలని ఆదివాసీ సంఘాల నాయకులు ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఇందులో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఆదివాసీ సంఘాల నాయకులు గోడం గణే శ్, పుర్క బాపురావు, జయవంత్‌రావు, పెందూర్ దాదిరావు, గేడం రేణుకబాయి, వెట్టి మనోజ్, ఉయిక ఇంద్రబాయి, మడావి ఆనంద్‌రావు, సలాం వరుణ్, సిడాం శంభు,తదితరులు పాల్గొన్నారు.