
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ రాజర్షి షా ● తాంసి పీహెచ్‌సీ, పీఏసీఎస్ తనిఖీ
తాంసి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల ని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, పీఏసీఎస్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. తరచూ విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ అసిస్టెంట్ సాయితేజకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అనంతరం సహకార సంఘం కార్యాలయంలో ఎరువుల నిల్వలు పరిశీలించారు. స్టాక్ రికార్డులు తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, డీసీవో మోహన్, ఏవో రవీందర్, వైద్యసిబ్బంది నర్మద, సుజాత, సహకార సంఘం సీఈవో కేశవ్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.