
మెగా జాబ్‌మేళాకు స్పందన
కైలాస్‌నగర్:నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టాస్క్ సౌజన్యంతో మంగళవారం నిర్వహించిన మెగా జా బ్‌మేళాకు స్పందన లభించింది. జిల్లాయంత్రాంగం ఆధ్వర్యంలో ఎస్టీయూభవన్‌లో నిర్వహించిన మేళా కు జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు భారీ గా తరలివచ్చారు. ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన 34 కంపెనీల ప్రతినిధులు హాజరై పదోతరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతల ఆధారంగావారికి ఇంట ర్వ్యూలు నిర్వహించారు. నైపుణ్యం ఆధారంగా ఉ ద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించి మాట్లాడారు. ప్రజావాణిలో అందుతున్న వినతుల నేపథ్యంలో జాబ్‌మేళా ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభంలో వేతనం తక్కువ ఉన్నా వృత్తినైపుణ్యం పెంపొందించుకుంటే మంచి ప్యాకేజీ పొందవచ్చన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్, డీడబ్ల్యూవో మిల్కా,పరిశ్రమలశాఖ జీఎం పద్మభూషణ్ రాజు, మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్.రాజు, డీవైఎస్‌వో శ్రీనివాస్, డీఎల్‌పీవోలు ఫణిందర్‌రావు, ప్రభాకర్‌రావు, స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.