
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
మహాగర్జనకు తరలిరండి●
ఆదిలాబాద్‌రూరల్: పింఛన్ పెంపు హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మహాగర్జన సన్నాహక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ‘సాక్షి’లో వృద్ధులు, దివ్యాంగుల గురించి కథనాలు రావడంతో చలించి వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పింఛన్ పెంచి అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడస్తున్నా పింఛన్ పెంపు ఊసే లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్‌కు పేదల బాధలు తెలియవని, ఎందుకంటే వారి ఇంట్లో ఎవరు కూడా పేదలు లేరన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.