
కలెక్టర్‌కు సన్మానం
కైలాస్‌నగర్: సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్‌లో రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, సమష్టి కృషితోనే అవార్డు సాధించగలిగా మని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
కై లాస్‌నగర్: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, వాటి ప్రాముఖ్యతపై మహిళలు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార దినోత్సవ అవగాహన ప్రచార పో స్టర్లను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈనెల 7వరకు తల్లిపాల వారో త్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి పా లలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఇందులో అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సంక్షేమాధికారి మిల్కా,డీఆర్డీవో రాథోడ్‌రవీందర్‌పాల్గొన్నారు.