
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లాకేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాల యంలో సోమవారం నిర్వహించిన గ్రీ వెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 38 మంది హాజరై దరఖాస్తులు అందజేశారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధి కారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ పాల్గొన్నారు.