
గాడితప్పిన పల్లె పాలన
● ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు ● విధులకు డుమ్మా కొడుతున్న కార్యదర్శులు ● పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా అస్తవ్యస్తం
కై లాస్‌నగర్: పంచాయతీ ప్రత్యేకాధికారులు పల్లెల ముఖం చూడటం లేదు. గ్రామాలను విధిగా సందర్శిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పర్యవేక్షించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా తమకేం సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న పలువురు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో పంచాయతీ పాలన పూర్తిగా గాడి తప్పింది.
సంతకాల కోసమే అన్నట్లుగా..
పంచాయతీ పాలకవర్గాల గడువు గతేడాది జనవరి 31న ముగిసింది. దీంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమైంది. జిల్లాలో 123 మంది వివిధ శా ఖ ల గెజిటెడ్ అధికారులను పంచాయతీ స్పెషలా ఫీసర్లుగా నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, ఎంఈవోలు, పీఆర్‌ఏఈలు, సూపరింటెండెంట్లు, ఏంఏఓలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, వాటర్‌గ్రిడ్ ఏఈలు వంటి అధి కారులున్నారు. కొన్ని మేజర్ పంచాయతీలకు జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు పంచాయతీల ముఖమే చూడటం లేదు. నెలలో కనీసం ఒకటి, రెండు సార్లు సందర్శించిన దాఖలాలు సైతం కనిపించడం లేదు. జిల్లా కలెక్టర్ పర్యటించిన సమయాల్లో మాత్రమే ఆ గ్రామాలకు వస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం సంతకాల కోసం మాత్రమే ఉన్నారన్నట్లుగా వీరు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువై పంచాయతీ పాలన గతితప్పుతోంది.
విధులకు కార్యదర్శుల డుమ్మా ..
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు కా ర్యదర్శులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఉదయ మే గ్రామానికి చేరుకుని పంచాయతీ మానిటరింగ్ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఫొటో అప్ లోడ్ చేసి అటెండెన్స్ నమోదు చేయాలి. కానీ జిల్లాలో చాలామంది విధులకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. తమ ము ఖాలకు బదులు పంచాయతీలోని కుర్చీలు, బీరువా లు,టేబుళ్లు,పంచాయతీ పరిసరాలు నమోదు చేస్తూ అధికారులను తప్పుతోవ పట్టిస్తున్నారు. విధులకు రాకుండా ప్రైవేట్ దందాలు నిర్వహిస్తున్నారు. వీరి హాజరును పర్యవేక్షించాల్సిన ఎంపీవోలు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. ఫలితంగా పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదు.
తొమ్మిది మంది ఎంపీవోలు.. 26 మంది కార్యదర్శులపై చర్యలు
విధులకు రాకున్నా వచ్చినట్లుగా తప్పుడు హాజరు నమోదు చేసిన కార్యదర్శులపై పంచాయతీరాజ్ క మిషనరేట్ చర్యలు చేపట్టేదాకా జిల్లా అధికారులకు విషయం తెలియదంటే పర్యవేక్షణ ఏ విధంగా ఉందనేది స్పష్టమవుతుంది. జిల్లాలో స్థానిక సంస్థల ప ర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారితో పా టు జిల్లా పంచాయతీ అధికారి, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు ఉన్నారు. ఎంపీవోలు సై తం తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంత మంది అధికారులు ఉండగా కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తుంటే వీరంతా ఏం చేస్తున్నారనే సందేహం క లుగుతోంది. జిల్లాలో 9మంది ఎంపీవోలకు, 21 మంది కార్యదర్శులకు నోటీసులు జారీచేయగా, మ రో నలుగురు కార్యదర్శులకు చార్జీమెమోలు ఇచ్చా రు. అలాగే ఓ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది. లోతుగా విచారిస్తే మరింత మంది బయటపడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
జిల్లాలో..
గ్రామ పంచాయతీలు : 473
రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు : 417
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్యదర్శులు : 31
కఠినంగా వ్యవహరిస్తాం
పంచాయతీలను సందర్శించి సమస్యలను పరి ష్కరించేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేకాధికా రులపై ఉంటుంది. వారు సందర్శించడం లేద నే విషయం నా దృష్టికి రాలేదు. కార్యదర్శుల పనితీరుపై దృష్టి సారిస్తాం. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
– జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి