
‘వర్సిటీ’ ఆవశ్యకతపై అవగాహన
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోయూనివర్సిటీ ఏర్పా టు చేయాలని ఆదిలాబాద్ యూనివర్సిటీ సా ధన సమితి జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. వర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లైబ్రెరీలో ఆదివారం అ వగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చ దువుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నా రు.ఆర్థికంగా లేనివారు మధ్యలోనే ఆపేస్తున్నా రన్నారు. విద్యార్థినులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక డిగ్రీకే పరిమితమవుతున్నారని పేర్కొన్నా రు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.విద్యార్థులంతా వర్సిటీ సాధన కోసం ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కోకన్వీనర్ రమణాగౌడ్, సుహాసినిరెడ్డి, ఉదారి నారాయణ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.