
టీబీ రహిత సమాజానికి కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: టీబీ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. రిమ్స్‌లో శనివారం టీబీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జిల్లాలో టీబీ నివారణ కు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జ నరల్ మెడిసిన్, పీడియాట్రిక్‌తో పాటు ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడారు. దేశంలో టీబీ నివారణ కోసం ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, వైద్యులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.