
ఏటా కలుసుకుంటున్నాం..
● అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
నా టెన్త్ ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తయింది. మాది 1986–87 బ్యాచ్. అప్పుడు విడిపోయిన మేమంతా ఇరవై ఏళ్ల తర్వాత 2006లో కలుసుకున్నాం. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా మళ్లీ కలుసుకోవడంతో మా స్నేహం తిరిగి చిగురించింది. అప్పటి నుంచి ఏటా వేసవిలో అపూర్వ సమ్మేళనం పేరిట 120 మంది వరకు ఒక్క చోటకు చేరుతున్నాం. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. హోదాలతో సంబంధం లేకుండా మా ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నాం. రీ యూనియన్ రోజు అన్నీ మరిచిపోతాం. ఆ జ్ఞాపకాలను ఆస్వాదిస్తాం. సృష్టిలో స్నేహ బంధం ఎంతో గొప్పది. నిజమైన స్నేహితులను వదులుకోవద్దు. – నేరడిగొండ
అవసరాల కోసం స్నేహాలు చేస్తున్న ప్రస్తుత సమాజంలో 50 ఏళ్లుగా ఓ ఇద్దరూ వ్యక్తులు స్నేహానుబంధాన్ని పంచుకుంటూ పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. 1970 దశకంలో మొదలైన వారి సోపతి ఇప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా సాగుతోంది. వారే పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన కొమ్ము రాజన్న, తిర్పెళ్లి కాలనీకి చెందిన సట్ల అశోక్. వీరి తల్లిదండ్రులు కూడా వీరిలాగే కలిసిమెలిసి ఒకే కుటుంబంలా మెలిగేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరూ కలిసి తీసుకుంటామని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు సందర్శిస్తామని, తాము కలవనిదే రోజు గడవదని చెబుతున్నారు. రాజన్న ప్రస్తుతం డీఎస్‌ఏలో వాచ్‌మెన్ విధులు నిర్వహిస్తుండగా, మల్లేశ్ వ్యవసాయం చేస్తున్నాడు. మేము కలిసి చేసిన కష్టమే ఒకరిపై ఒకరికి గౌరవాన్ని పెంచడంతో పాటు బలమైన బంధానికి పునాదులు వేసిందని చెప్పుకొచ్చారు ఈ చెడ్డీ దోస్తులు. – ఆదిలాబాద్
50 ఏళ్ల దోస్తానా..

ఏటా కలుసుకుంటున్నాం..

ఏటా కలుసుకుంటున్నాం..