
కలెక్టర్‌కు మరో అవార్డు
● రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న రాజర్షి షా
కై లాస్‌నగర్: నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నార్నూర్ బ్లాక్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కలెక్టర్ రాజర్షి షాను ఇప్పటికే జాతీయస్థాయి అవార్డు వరించగా.. తాజాగా రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)సంపూర్ణతా అభియాన్ సమ్మాన్ సమరోహ్ పేరిట ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నా రు. గోల్డ్‌మెడల్‌తో పాటు ప్రశంసాపత్రం అందజేసి వారు అభినందనలు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, ప్రిన్సిపల్ సెక్రటరీలు జ్యోతి బుద్ద ప్రకాశ్, దాన కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తుకొచ్చిన ఆ ముగ్గురు ఐఏఎస్‌లు..
కాగా ఈ వేదికపై గతంలో ఆదిలాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన మరో ముగ్గురు ఐఏఎస్‌లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణారావు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే జ్యోతిబుద్ధప్రకాశ్, దివ్యదేవరాజ న్‌లు సైతం కొత్త ఆదిలాబాద్‌కు కలెక్టర్లుగా వ్యవహరించినవారే. ఆ ముగ్గురూ ఇదే వేదికపై ఉండటం జిల్లావాసులకు గత జ్ఞాపకాలను గుర్తు చేసినట్లయింది. అలాగే సమగ్ర గిరిజన అభివృద్ధిసంస్థ పరిధిలో సేవలందించిన ఉ ట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.