
స్నేహబంధం గొప్పది..
● కలెక్టర్ రాజర్షి షా
ఐఐటీ కాన్పూర్‌లో చదివే రో జుల్లో మేం నలుగురం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. సివి ల్స్‌కు సన్నద్ధమైన సమయంలో మా స్నేహం మరింత బలపడింది. ఎలాంటి సందేహాలున్నా ఒకరికొకరం చర్చించుకుని పరిష్కరించుకునేవాళ్లం. మా నలుగురిలో ఇద్దరం ఐఏఎస్‌గా ఎంపికవ్వగా, మరో ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. విధి నిర్వహణ పరంగా దూరంగా ఉన్నప్పటికీ ఫోన్‌లో మాట్లాడుకుంటాం. యోగాక్షేమాలు అడిగి తెలుసుకుంటాం. శుభకార్యాల్లో కలుస్తూ ఉంటాం. అలాగే నా భార్య, యాపల్‌గూడ 2వ బెటాలియన్ కమాండెంట్, ఐపీఎస్ నితిక పంత్ నా బ్యాచ్‌మెట్. పనిలో, వ్యక్తిగత జీవితంలో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలున్నా చర్చించుకుని ముందుకు సాగుతున్నాం. స్నేహబంధం ఎంతో గొప్పది. ఒక మంచి స్నేహితుడు, స్నేహితుల బృందం ఓ వరం. ఒత్తిడిలేని జీవితం గడపడానికి, లక్ష్యసాధనకు దోహదపడుతారనేది నా అభిప్రాయం. – కై లాస్‌నగర్

స్నేహబంధం గొప్పది..