
జాతీయ రహదారిగా ఉన్నతీకరించాలి
● ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని గు డిహత్నూర్ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లా అల్లాపల్లి వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారి గా ఉన్నతీకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ గోడం నగేశ్ కోరారు. గురువారం రాత్రి మంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ రహదారిని ఉన్నతీకరిస్తే గడ్చిరౌలిలో ఉన్న జాతీయరహదారి 353సీ తో అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు. గుడిహత్నూర్ నుంచి ఇంద్రవెల్లి, ఉట్నూరు, జైనూరు, కెరమెరి, ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్, కౌటాల, గూడెం మీదుగా అల్లాపల్లి వరకు గల ఈ మార్గంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు రహదారు ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.
జేఎన్‌వీ మంజూరు చేయాలి
ఆదిలాబాద్: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో రూల్ 377 కింద వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని అన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడంలో ఇబ్బందులు తప్పడం లేదని, అలాగే జాతీయ అక్షరాస్యతతో పోల్చితే జిల్లా అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉందన్నారు. వీటికి పరిష్కార మార్గంగా జవహన్ నవోదయ విద్యాలయం(జేఎన్‌వీ) ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.