
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ఇంద్రవెల్లి: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నా రు. మండలకేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తాతో కలిసి కొత్త రేషన్‌కార్డులను లబ్ధిదారులకు శుక్రవా రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎలాంటి పైర వీ లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ మత రాజకీయాలు మా నుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎస్‌వో వాజిద్ అలీ, ఆది లాబాద్ ఆర్డీవో స్రవంతి, ఇంద్రవెల్లి మా ర్కెట్ కమి టీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్ర వీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, కాంగ్రెస్ నాయకులు ఎండీ మసూద్, ఎండీ జహీర్ తదితరులున్నారు.