
సమష్టి కృషితో గ్రామాలాభివృద్ధి
జైనథ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే పా యల్ శంకర్ తెలిపారు. మండలంలోని జైనథ్, బెల్గం గ్రామాల్లో గురువారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణాల కు భూమిపూజ చేశారు. బెల్గం గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ పథకాలతో అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. పొలం బాట కార్యక్రమం ద్వారా పొలాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, నాయకులు అడ్డి భోజారెడ్డి, అల్లూరి అశోక్‌రెడ్డి, బోయర్ విజయ్, కరుణాకర్‌రెడ్డి, రాందాస్, అశోక్‌రెడ్డి, రమేశ్, సూర్య, ప్రతాప్‌యాదవ్, విశాల్, నరేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.