
రేషన్‌కార్డుల పంపిణీ
బజార్‌హత్నూర్: మండల కేంద్రంలోని రైతువేదికలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్‌జా దవ్ గురువారం మండలానికి చెందిన 160 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు పంపి ణీ చేశారు. వారు మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కొత్తగా పెళ్లయినవారు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం పీఏసీఎస్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు పరిశీలించారు. అ డిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్స య్య, ఆత్మ చైర్మన్ గొర్ల రాజుయాదవ్, పీఏసీ ఎస్ చైర్మన్ మేకల వెంకన్న, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్ మండల కేంద్రంలో..
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని రైతువేదికలో కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే అనిల్‌జాద వ్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, తహసీల్దార్ కవితారెడ్డి, నాయకులు సంజీవ్‌కుమార్, ప్రకాశ్ తదితరులున్నారు.