
కొబ్బరి బోండాల విక్రయదారులపై బల్దియా కొరడా
కై లాస్‌నగర్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కొబ్బరి బోండాల విక్రయదారులపై బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం పట్టణంలోని రిమ్స్, ప్రభుత్వ డైట్ కళాశాల వద్ద గల కొబ్బరిబొండాల దుకాణాలను పరిశీలించారు. ఖాళీ బోండాలను తొలగించకుండా చెత్తలా నిల్వచేసినందుకు గాను 24 మంది యజమానులకు రూ.500 చొప్పున రూ.12,000 జరిమానా విధించారు. మరోసారి పునరావృతం అయితే బోండాలతోపాటు తోపుడుబండ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇందులో శానిటరీ ఇన్‌స్పెక్టర్ భైరీ శంకర్, టీపీఎస్ నవీన్‌కుమార్, టీపీబీవో సాయికృష్ణ, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ రవికిరణ్, ఏరియా జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.