
‘నాగోబా’కు నీరా‘జనం’
ఇంద్రవెల్లి: నాగుల పంచమి సందర్భంగా ఆదివాసీ ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయం మంగళవారం భక్తజన సంద్రమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీసంఖ్యలో భక్తులు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుని నాగోబాను దర్శించుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మెస్రం వంశీయులు అతడిని శాలువాలతో సన్మానించారు. మెస్రం వంశీ యులు భక్తులకు జొన్న గట్కాతో కూడిన ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో వెలిసిన దుకా ణాల వద్ద సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో శ్రీనాగోబా యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబా ల్ పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్, నాగ్‌నాథ్, మెస్రం శేఖర్‌బాబు, దేవ్‌రావ్, వంశ పెద్దలు మెస్రం బాదిరావ్, ఆనంద్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.

‘నాగోబా’కు నీరా‘జనం’