
ఎస్సారెస్పీలోకి 65వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మామడ: ఎగువ కురుస్తున్న వర్షాలకు క్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ పెరిగింది. మంగళవారం 65వేల క్యూసెక్కుల వరద చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,076.60 అడుగులు (36. 464 టీఎంసీలు) నీటి నిల్వ ఉంది. దీంతో సరస్వతీ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తంజేస్తున్నారు.
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
కాగజ్‌నగర్‌టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఉండగా ఆగస్టు 13వ తేదీ వరకు పొడగించినట్లు కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ రేపాల కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. https:// cbseitms. rcil. gov. in/ nvs/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్యాండిడెట్ కార్నర్‌లో రిజిస్ట్రేషన్ ఫర్ 6వ తరగతి 2026–27ను క్లిక్ చేసి అప్లికేషన్ ఫాం ఫిల్ చేసుకోవాలని ఆయన సూచించారు.
విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు
ఉట్నూర్‌రూరల్: మండలంలోని గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు ఉన్నత వి ద్యలో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలవాలని సూ చించారు. పెంబి మండలం పాశపుల గ్రామానికి చెందిన గుగ్లావత్ వామనరావ్‌కు జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం, ఉట్నూర్ మండలం శంకర్‌తండా గ్రామానికి చెందిన రాథోడ్ మనోజ్‌కు ఐఐటీ చదవుల కోసం వారి తల్లిదండ్రుల సమక్షంలో ల్యాప్ టాప్‌లు అందజేసినట్లు తెలిపారు. పట్టుదలతో ల క్ష్యాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.