
జనగణనలో షెడ్యూల్డ్ ట్రైబ్ కాలమ్ పొందుపరచాలి
ఆదిలాబాద్: 2027లో చేపట్టనున్న జనగణనలో ఆ దివాసీలకు సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తించే ప్రత్యేక కాలమ్ పొందుపరచాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) నాయకులు కోరారు. మంగళవా రం హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. జనగణ నలో కాలమ్ పొందుపరిచే అంశాన్ని కేంద్రానికి సి ఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. 50శాతానికి మించి జనాభా ఉన్న ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని కోరారు. ఆదివాసీలకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలున్న నేపథ్యంలో షెడ్యూల్ ట్రైబ్ మతంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశా రు. అనేక సమస్యల నుంచి నాన్ షెడ్యూల్డ్ గ్రామాలుగా ఉన్న కారణంగా ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ పథకాలు అందడంలేదని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత హక్కులు ఆ ప్రాంతవాసులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కలిసినవారిలో మాజీ ఎంపీ మీడియం బాబురావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాయకులు రవికుమార్, శ్రీరామ్, ధర్మ తదితరులున్నారు.