
జాతీయ విద్యాసదస్సులో రంగయ్య
కెరమెరి(ఆసిఫాబాద్): ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన జాతీయ విద్యాసదస్సుల్లో మండలంలోని సావర్‌ఖెడా పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత కడేర్ల రంగయ్య పాల్గొన్నారు. అఖిల భారతీయ శిక్షా సమాగం (ఏబీబీఎస్) ఐదో వార్షి కోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్వంలో నిర్వహించిన ఈ సదస్సులో ఎన్‌ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) –2020లో ఎలాంటి మార్పులు జరిగాయి, విద్యాభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలు.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చర్చించినట్లు రంగయ్య తెలిపారు. సదస్సులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రొఫెసర్లు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఐదుగురు ఇన్నోవేటర్ స్టూడెంట్స్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.