
వైద్యశాఖ డైరెక్టర్‌కు వినతి
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ నరేందర్ కుమార్‌ను తెలంగాణ ల్యాబ్ టెక్నికల్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో ఆ శాఖ జిల్లా ఉద్యోగులు కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వి నతిపత్రం అందజేశారు. పదోన్నతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన వారి తో భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు డైరెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిజామొద్దీన్, సంఘ బాధ్యులు రమణాచారి, సమి ఉన్నారు.