
అర్హులందరికీ రేషన్‌కార్డులు
● కలెక్టర్ రాజర్షి షా
జైనథ్: అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్‌కార్డు అందేలా చూస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణ మండపంలో మంగళవారం జైనథ్, బోరజ్, సాత్నాల, బేల మండలాలకు సంబంధించిన కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆయన లబ్ధిదారులకు కార్డులు అందించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్‌వో వాజిద్ అలీ, తహసీల్దార్లు ఆత్రం నారాయణ, రాజేశ్వరి, విశ్వనాథ్, రఘునాథ్, ఎంపీడీవో మహేశ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. మౌలిక వసతులపై ఆరా తీశారు.
సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలి
భీంపూర్:ప్రభుత్వం అందజేసే సన్నబియ్యంను రేష న్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక రైతువేదికలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రా మాలకు చెందిన 200 మందికి కొత్త రేషన్ కార్డుల ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి అందజేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా కేజీబీవీ ఆవరణలో మొక్కలు నాటారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్‌వో వాజిద్ అలీ, తహసీల్దార్ నలంద ప్రియ, అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక అంగన్‌వాడీ కేంద్రంను కలెక్టర్ సందర్శించారు. చిన్నారుల హాజరు వివరాలు అడి గి తెలుసుకున్నారు. అలాగే పీఏసీఎస్ కేంద్రంలోని యూరియా స్టాక్ వివరాలు పరిశీలించారు.
సర్వేయర్ శిక్షణార్థుల ‘ప్రాక్టికల్’ పరిశీలన
ఆదిలాబాద్: జిల్లాలో లైసెన్స్‌డ్ సర్వేయర్ శిక్షణలో భాగంగా ఏరోడ్రాం మైదానంలో నిర్వహిస్తున్న ప్రా క్టికల్ పరీక్షలను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. శిక్షణ వివరాలను సంబంధిత అధి కారులు కలెక్టర్‌కు వివరించారు.