
నాగోబాను దర్శించుకున్న ఎస్పీ
ఇంద్రవెల్లి: నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి దర్శించుకున్నారు.మెస్రం వంశీయులు వారిని సన్మానించారు. నాగోబా ప్రతిమలు అందజేశారు.
మహిళల సమస్యలపై శ్రద్ధ వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: మహిళల సమస్యలపై ప్రత్యే క శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌తోపాటు టూటౌన్‌ను మంగళవారం తని ఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో గౌరవంగా మెదలాలని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పట్ట ణంలో ఓపెన్‌డ్రింక్ జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు. మట్కా, గుట్కా, గంజాయి, ఇత ర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలా బాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కరుణా కర్‌రావు, మహిళా స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ తదితరులు ఉన్నారు.