
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి●
సాత్నాల: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. భోరజ్ మండలంలోని కొరటా, గిమ్మ, తర్ణం గ్రామాల్లో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హాజరయ్యారు. ముందుగా చనాఖా–కొరటా ప్రాజెక్టును సందర్శించారు. పెన్‌గంగ బ్రిడ్జి వద్ద నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పా ల్గొని మాట్లాడారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఆయా గ్రామాల యువతకు వాలీబాల్ కిట్స్ అందజేశారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై గౌతమ్, మూడు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.