సర్కారు బడిలో ప్రీప్రైమరీ | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడిలో ప్రీప్రైమరీ

Jul 28 2025 7:49 AM | Updated on Jul 28 2025 7:49 AM

సర్కా

సర్కారు బడిలో ప్రీప్రైమరీ

● ఎల్‌కేజీ, యూకేజీ అందుబాటులోకి ● జిల్లాలో 15 పాఠశాలలు ఎంపిక ● పీఎంశ్రీ కింద ఇప్పటికే నాలుగు బడుల్లో అమలు

15 పాఠశాలల్లో అమలు..

జిల్లాలోని 15 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ) అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో పీఎంశ్రీ పథకం కింద ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైంది. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన బోధన అందించడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టీచర్‌, ఆయాలను తా త్కాలిక పద్ధతిన నియమించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు బడులు మరింత బలోపేతం అవుతాయి.

– రఘురమణ,

విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌లో ఇంగ్లీష్‌ మీడియం చదివించేందుకు నాలుగేళ్ల కంటే ముందే చేర్పిస్తున్నారు. విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలు అక్కడే పైతరగతులు చదవడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీప్రైమరీ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కొన్నేళ్లుగా విన్నవిస్తున్నారు. జిల్లాలో ఇదివరకే పీఎంశ్రీ పథకం కింద నాలుగు ప్రీప్రైమరీ స్కూళ్లు ప్రస్తుతం కొనసాగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 15 పాఠశాలలను ఎంపిక చేసింది. త్వరలో తరగతులను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి శనివా రం ఉత్తర్వులు జారీ చేసింది. తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుండగా.. నిరుద్యోగులకు సైతం ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఎంపికై న పాఠశాలలు ఇవే..

ప్రీప్రైమరీ విద్యాబోధన కోసం జిల్లాలో 15 పాఠశాలలను ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో కేశవపట్నం ప్రాథమిక పాఠశాల, దుబ్బ(కె), కంఠ, దస్నాపూర్‌గూడ, వైజాపూర్‌, కేస్లాగూడ, బరంపూర్‌, రాంపూర్‌(పి), మల్కాపూర్‌, చెర్లపల్లి, గుబిడి, యాపల్‌గూడ, రణదీవెనగర్‌, పిప్పల్‌కోటి ఉర్దూ మీడియం, ప్రభుత్వ పాఠశాల భుక్తాపూర్‌ పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం పీఎంశ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో నాలుగు పాఠశాలలను ప్రీప్రైమరీ కోసం ఎంపిక చేసింది. జైనథ్‌ మండలంలోని దీపాయిగూడ, సిరికొండ మండల కేంద్రం, భీంపూర్‌ మండలంలోని నిపాని, గాదిగూడలోని చింతగూడ పాఠశాలల్లో వీటిని ప్రారంభించింది. ఆయా పాఠశాలల్లో ఇందుకోసం ప్రత్యేక తరగతి గది ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆటపాటలతో కూడిన చదువు, స్లీపింగ్‌ ఆవర్‌, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు ఆయా గ్రామాల్లోనే ఉన్న త చదువు చదివిన వారిని ఎంపిక చేశారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు చెల్లిస్తున్నారు. మూడేళ్లు పైబడిన పిల్లలను ఎల్‌కేజీ, నాలుగేళ్లు పైబడిన వారిని యూకేజీలో చేర్చుతున్నారు. వీటి నిర్వహణ నిమిత్తం గ్రీన్‌బోర్డులు, ఫ్యాన్లు, ఇతర వాటి కోసం రూ.30వేలు, బోధన సామగ్రి, ఆట వస్తువుల కోసం మరో రూ.30వేలు విడుదల చేసింది.

సర్కారు బడుల బలోపేతం కోసం..

సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తుంది. ఇక్కడ ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలు వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో చేరేందుకు అర్హత ఉంటుంది. తద్వారా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు పిల్లలకు ప్రైవేట్‌కు ధీటుగా సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందుతుంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించనున్నారు. అవసరమైన ఫర్నిచర్‌, ఆట వస్తువులు, బోధన సామగ్రి, భద్రత ప్రమాణాలు, విద్యార్థులను ఆకర్షించేలా గోడలపై రంగు రంగుల బొమ్మలు, పిల్లలు నిద్రపోయే గదిని ఏర్పాటు చేయనున్నారు. పారిశుధ్య పనులను గ్రామపంచాయతీతో చేపట్టనున్నారు.

జిల్లాలో డీఈవో పరిధిలో పాఠశాలలు..

ప్రాథమిక : 500

ప్రాథమికోన్నత : 119

ఉన్నత : 120

మొత్తం విద్యార్థులు : 65వేల మంది

సర్కారు బడిలో ప్రీప్రైమరీ1
1/1

సర్కారు బడిలో ప్రీప్రైమరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement