‘స్థానిక’.. సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’.. సన్నద్ధం

Jul 28 2025 7:49 AM | Updated on Jul 28 2025 7:49 AM

‘స్థానిక’.. సన్నద్ధం

‘స్థానిక’.. సన్నద్ధం

● ఆదిలాబాద్‌ ఎన్నికలకు గుజరాత్‌ బ్యాలెట్‌ బాక్స్‌లు ● అదనంగా 1030 తెప్పించుకోవాలని సర్కారు ఆదేశం ● రిజర్వేషన్ల ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం

కై లాస్‌నగర్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.పంచాయతీ, పరిషత్‌ ఎన్ని కలను ఏకకాలంలో నిర్వహించాలని భావిస్తోంది. సెప్టెంబర్‌ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బందిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించిన ప్రభుత్వం తాజాగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలె ట్‌ బాక్స్‌లపై దృష్టి సారించడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ బాక్స్‌లు జిల్లాలో ఇప్పటికే అందుబాటులో ఉండగా అదనపు బాక్స్‌లను ఇతర రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాలని ఆదేశించడంతో ఈ రెండు ఎన్నికలు ఏకకాలంలో ఉంటాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల పై సోమవారం నిర్వహించనున్న రాష్ట్ర కేబినేట్‌లో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.ఈ భేటీ తర్వాత ఎప్పుడైనా స్థానిక పోరుకు నోటిఫికేషన్‌ వెలువడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏకకాలంలో స్థానిక పోరు ..

జిల్లాలోని 473 గ్రామపంచాయతీలు, 3,870 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం 2,400 బ్యాలెట్‌ బ్యాక్స్‌లను సిద్ధం చేశా రు. పంచాయతీ ఎన్నికలకు ఉదయం పోలింగ్‌, మ ధ్యాహ్నం కౌంటింగ్‌ ఉండే అవకాశముండటంతో ఈబాక్స్‌లు ఎన్నికలకు పూర్తిస్థాయిలోసరిపోనున్నా యి. అదే పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ జరిగిన వారం, 15 రోజుల తర్వాత ఫలితాలు వెల్ల డించే అవకాశముంటుంది. అప్పటి వరకు బాక్స్‌ల ను కౌంటింగ్‌ కేంద్రాల్లో భద్రపర్చాలి. దీంతో సరి పడా బాక్స్‌లను సమకూర్చుకోవాలని ప్రభుత్వం జిల్లా పంచాయతీ, జెడ్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు ఎన్నికలను కొన్ని రోజుల వ్యవధిలో నిర్వహించవచ్చనే అభిప్రాయాన్ని ఆయా శాఖల అధికా రులు, ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్‌ బ్యాలెట్‌ బాక్స్‌లు ..

పంచాయతీ, పరిషత్‌ ఎన్నికలను రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహిస్తే బ్యాలెట్‌ బాక్స్‌ల కొరత ఏర్పడే అవకాశముందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మరో 1030 బాక్స్‌లను గుజరాత్‌ నుంచి తెప్పించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ చర్యలు పరిశీలిస్తే ఈ రెండు ఎన్ని కలను హైకోర్టు ఆదేశాలకనుగుణంగా గడువులోపు పూర్తిచేయాలని భావిస్తున్నట్లుగాతెలుస్తోంది. మరో వైపు జిల్లాలోని సీనియర్‌ ఎంపీడీవోలు, పంచాయ తీ కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాలను ఆ రాష్ట్రానికి పంపించే దిశగా కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్‌ అనుమతి మేరకు రెండు, మూడు రోజుల్లోనే వారు గుజరాత్‌లో పర్యటించి అక్కడి నుంచి బాక్స్‌లను జిల్లాకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణపై నేడు స్పష్టత

స్థానిక ఎన్నికలను సెప్టెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విష యం తెలిసిందే. రెండు నెలల గడువు మాత్ర మే ఉండటంతో ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయా లని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. సోమవారం సీఎం రేవంత్‌అధ్యక్షతన జరిగే కేబినేట్‌ మీటింగ్‌లో దీనిపై స్పష్టత రానుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు ఇంకా గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. ఈ నేపథ్యంలో ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేస్తారనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అయితే నేటి కేబినెట్‌ భేటి అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఆశావహుల్లోనూ ప్రతిష్టంభన తొలగిపోనుంది.

కలెక్టర్‌కు ఫైలు పంపించాం

ఎన్నికల నిర్వహణకు వీలుగా జిల్లాకు అదనంగా బ్యాలెట్‌ బాక్స్‌లను తెప్పించుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇందుకోసం కలెక్టర్‌కు తగు వివరాలతో కూడిన ఫైల్‌ను పంపించాం. వారి అనుమతి మేరకు ప్రత్యేక బృందాన్ని గుజరాత్‌కు పంపించి బ్యాలెట్‌ బాక్స్‌లను తెప్పిస్తాం. ప్రభుత్వ, ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలా తగు

చర్యలు తీసుకుంటాం.

– జి.రమేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement