● మంజూరు లేదు.. అగ్రిమెంట్‌ లేదు ● క్షేత్రస్థాయిలో స్తంభాలైతే పాతేశారు ● విద్యుత్‌శాఖలో దొడ్డిదారిన పనులు ● అవసరం లేకున్నా అదనపు పోల్స్‌ ● సొంత లాభానికే కొందరు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

● మంజూరు లేదు.. అగ్రిమెంట్‌ లేదు ● క్షేత్రస్థాయిలో స్తంభాలైతే పాతేశారు ● విద్యుత్‌శాఖలో దొడ్డిదారిన పనులు ● అవసరం లేకున్నా అదనపు పోల్స్‌ ● సొంత లాభానికే కొందరు పెద్దపీట

Aug 7 2025 7:52 AM | Updated on Aug 7 2025 7:56 AM

● మంజూరు లేదు.. అగ్రిమెంట్‌ లేదు ● క్షేత్రస్థాయిలో స్తం

● మంజూరు లేదు.. అగ్రిమెంట్‌ లేదు ● క్షేత్రస్థాయిలో స్తం

సాధారణంగా ఒక పని కార్యరూపం దాల్చాలంటే వివిధ ఘట్టాలను దాటాల్సి ఉంటుంది. ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎస్టిమేట్‌ (అంచనా వ్యయం) రూపొందించి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. వారు పరిశీలన చేసి మంజూరు ఇ స్తారు. తర్వాత టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఆసక్తిగల కాంట్రాక్టర్లు అందులో పాల్గొనడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం పనులు దక్కించుకు న్న కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ చేసుకుంటారు. వర్క్‌ఆర్డర్‌ జనరేట్‌ అవుతుంది. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు, కండక్టర్‌, ఇలా ఏవి అవసరం ఉంటాయో ఆ సామగ్రిని స్టోర్‌ నుంచి డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడికి వాటిని తరలించాలి. ఆ తర్వాత వర్క్‌ స్టార్ట్‌ అవుతుంది. మరి హస్నాపూర్‌లో ఈ పైన పేర్కొన్న తతంగం అంతా జరగకుండానే క్షేత్రస్థాయిలోకి సామగ్రి ఎలా వచ్చిందనేది అధికారులు తెలియదంటే మనం నమ్మాల్సిందే.

జిమ్మిక్కులు ఇలా..

అసలు వర్కే మంజూరు లేదు.. మరి సామగ్రి ఎక్క డి నుంచి తీసుకొచ్చి పని చేశారనే సందేహం రావ చ్చు. ఇక్కడ మనకు అధికారులు, వారి బినామీ కాంట్రాక్టర్ల జిత్తులమారి తంతు తెలుస్తోంది. అదేమిటంటే.. వేరే పనికి సంబంధించి నిబంధనల ప్రకా రం మంజూరు లభించడం, సామగ్రి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ పనికి సంబంధించి వివిధ అభ్యంతరాలను సృష్టిస్తారు. దీనిని క్షేత్రస్థాయిలోని వినియోగదారులు నమ్ముతారు. మన పనికి సంబంధించి సామగ్రి రావడంలో ఆలస్యమవుతుందని వారు కూడా అంతగా పట్టించుకోరు. ఇదంతా విద్యుత్‌ శాఖ అధికారుల జిమ్మిక్కు. ఇక ఆ సామగ్రిని ఇలా ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టే వర్కుల్లో వాడేస్తారు. తమ సొంత లాభం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధమవుతారు.

లూటీ ఇలా..

మంజూరు లేకుండా వర్క్‌ చేపట్టడం ఒక ఎత్తయితే.. ఆ పనిలో అక్రమాలకు పాల్పడటం ఇక్కడ విద్యుత్‌ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లకు వెన్నెతో పెట్టిన విద్య.అదెలాగంటే.. అవసరం లేకున్నా అద నంగా సామగ్రిని క్రియేట్‌ చేసి దాని ద్వారా అదనపు లాభం పొందడమే. దీనికి ప్రస్తుతం హస్నాపూర్‌లో జరుగుతున్న పనే నిదర్శనం. ఇక్కడ ఇదివరకే ఉన్న ఓ ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించి సపోర్ట్‌గా ఉన్న పోల్‌ డ్యామెజ్‌ అయ్యిందని, దాన్ని వేరే స్థలా నికి మార్చేందుకు అదనంగా స్తంభాలు అవసరమ ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా అదనంగా వేసే పోల్స్‌ ద్వారా వర్క్‌ అంచనా వ్యయం పెంచి తమ జేబులు నింపుకోవడమే. ఇవన్నీ విద్యు త్‌ శాఖలో సర్వసాధారణమే అనే విమర్శ లేకపోలేదు. పర్యవేక్షించే అధికారులే ఇలా అడ్డదారులు తొక్కే పరిస్థితి ఉండడంతో సంస్థ ఆదాయానికి గండి పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

నా దృష్టికి రాలేదు..

హస్నాపూర్‌లో వర్క్‌ జరిగినట్టుగా నా దృష్టికి రాలేదు. దాని గురించి తెలుసుకుంటాను. అయితే రోడ్డు వెంబడి ప్రమాదకర స్థలాల్లో అత్యవసరంగా పనులు చేపట్టాలని సీఎండీ నుంచి ఆదేశాలు ఉన్నాయి.

– జాదవ్‌ సుభాష్‌,

ఉట్నూర్‌ డీఈ, విద్యుత్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement