
మూడో రోజుకు ‘ఎండీఎం’ సమ్మె
కై లాస్‌నగర్: పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యా హ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట గల శిబిరంలో కార్మి కులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు కుంటాల రాములు మాట్లాడుతూ, పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీదేవి, శశికళ, పుష్కలత, రాంబాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.