
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
బోథ్: మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సొనాల మండలం కోట (కె)గ్రామంలో ఏర్పాటు చేసిన హరహర మహాదేవ్ పౌల్ట్రీ యూనిట్ షెడ్‌ను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. శకుంతలాబాయిని ఇతర గ్రామాల మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
బజార్‌హత్నూర్: మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎకై ్సజ్, అటవీ, డీఆర్‌డీఏ శాఖల అధ్వర్యంలో మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధి కనకాయి జలపాతం సమీపంలో బుధవారం వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొలం బాటలో భాగంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, డీఆర్డీవో రవీందర్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షి షా