
అందుబాటులో బుకింగ్ కౌంటర్లు..
పండుగకు సొంత గ్రామాలకు వెళ్లలేని మహిళలు తమ సోదరులకు రాఖీలను బుక్ చేసి పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పా టు చేసింది. రీజియన్ పరిధిలో మూడు బస్టాండ్లు, 26 ఏజెంట్ కౌంటర్లలో వీటిని ఇప్పటికే ప్రా రంభించారు. ఇందులో రాఖీలతో పాటు మిఠాయిలు సైతం పంపించుకునే వెసులుబాటు కల్పించారు. బుకింగ్‌లో సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో సెల్ నంబర్ 9154298531, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 9154298547, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో 9154298541, రీజినల్ మేనేజర్ కార్యాలయం సెల్ నంబర్ 9154298553 పై సంప్రదించాలని కరీంనగర్‌జోన్ కార్గో మేనేజర్ వెంకటనారాయణ కోరారు.