
ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా
● డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో తనిఖీలు ● ఓ ఆస్పత్రి, మరో ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్
ఆదిలాబాద్‌టౌన్: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం పట్టణ సమీపంలోని శేషన్న చెన్నవార్ కంటి ఆస్పత్రిని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌తో పాటు వైద్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. అయితే వైద్యుడి వివరాలు డీఎంహెచ్‌వో కార్యాలయంలో నమోదు లేకపోవడంతో నోటీసు జారీ చేశారు. అలాగే ఫీజు ఎక్కువగా తీసుకుంటున్నారని రోగులు ఫిర్యాదు చేశారు. అనంతరం దస్నాపూర్‌లోని హరిహరన్ ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేయగా, డాక్టర్ అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే ఆస్పత్రికి సంబంధించి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో సీజ్ చేశారు. అదే ప్రాంతంలో నాలుగు ఆర్‌ఎంపీ క్లినిక్‌లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఓ క్లినిక్‌ను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, మలేరియా నివారణ అధికారి శ్రీధర్ తదితరులున్నారు.