
నాణ్యమైన వైద్య సేవలందించాలి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి హరికిరణ్ ● బోథ్, గుడిహత్నూర్ మండలాల్లో పర్యటన
బోథ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ అ న్నారు. జిల్లాలోని బోథ్, గుడిహత్నూర్ మండలా ల్లో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా బోథ్ సీహెచ్‌సీని సందర్శించారు. వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన మహేశ్ కుమార్తె మూడేళ్ల చిన్నారి సాయి అన్విని చూసి చలించిపోయారు. ఆమె ఆరో గ్య పరిస్థితి తెలుసుకుని, ప్రత్యేక వైద్యం అందించా ల్సిందిగా డీఎంహెచ్‌వోను ఆదేశించారు. వెంటనే ఆమెను 108లో రిమ్స్‌కు తరలించారు. వర్షాకాలం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, మందుల నిల్వపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు బోథ్ ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘాల కేంద్రం, గోదాంను పరిశీలించారు. యూరియా స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా మహారాష్ట్రకు తరలిపోకుండా ఘన్‌పూర్ అబ్కారీ చెక్‌పోస్ట్ వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలన్నారు. వారి వెంట ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా,డీసీవో మోహన్, డీఏవో శ్రీధర్‌స్వామి, వైద్యసిబ్బంది, తదితరులున్నారు.
రిమ్స్‌లో కోలుకున్న చిన్నారి..
ఆదిలాబాద్‌టౌన్: చిన్నారి సాయి అన్వి రిమ్స్‌లో చేర్పించాక ఆరోగ్యం కొంత మెరుగుపడిందని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా తమ చిన్నారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ప్ర త్యేక అధికారి, కలెక్టర్, వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
రైతుసేవల్లో పారదర్శకత లక్ష్యం..
గుడిహత్నూర్: రైతులకు అందించే సేవల్లో పారదర్శకత లక్ష్యమని హరికిరణ్ అన్నారు. స్థానిక పీఏసీ ఎస్‌ను సందర్శించి మాట్లాడారు. ఈ పాస్ మిషన్ల ద్వారా అర్హులైన రైతులకు ఎరువులు, ఇతర సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. అనంతరం ఎరువుల గోదాంలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ కవితారెడ్డి, ఎంఏవో రమేశ్ భగత్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్, సీఈవో పండరీ ఉన్నారు.