
ప్రశాంతంగా ‘సర్వేయర్’, జీపీవో రాత పరీక్షలు
కైలాస్‌నగర్: జిల్లాలో లైసెన్స్‌డ్ సర్వేయర్, గ్రామ పాలనాధికారి పోస్టుల నియామకాల కోసం ఆదివా రం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాత పరీక్షలు ప్ర శాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 29 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్‌అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన లైసెన్స్‌డ్ సర్వేయర్ పరీక్షకు 155 మందికి గాను 129 మంది హాజరయ్యారు. 26 మంది గైర్హాజరయ్యా రు. ఉదయం 9.30 నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం నిర్వహించిన టిప్పన్ ప్లాటింగ్ పరీక్షలో 40మార్కులకు సంబంధించిన ప్రశ్న మరాఠీ మీడియంలో ఉండటంతో తెలుగులో తర్జుమా చేసేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ప్రశ్న ముద్రణ సైతం సరిగా లేక అయోమయానికి గురయ్యారు. అలాగే జీపీవో నియామ క పరీక్షను మావల మండల కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించిన పరీక్షకు 51 మంది హాజరుకావాల్సి ఉండగా 48 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సందర్శించారు. నిర్వహణ తీరును పరిశీలించారు. వారి వెంట ఆర్డీవో స్రవంతి, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, పరీక్షల పరిశీలకులు కె.రాజలింగు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.
నేటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
లైసెన్స్‌డ్ సర్వేయర్ శిక్షణార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు రాజేందర్ తెలిపారు. శిక్షణకు హాజరైన 155 మందిని రెండు బృందాలుగా ఏర్పాటు చేసిన ట్లు పేర్కొన్నారు. తొలి రోజున 80 మంది, 29న మి గతా వారికి ఉదయం 9నుంచి సాయంత్రం 5గంట ల వరకు జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ మైదానంలో ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.