
ప్రత్యేకాధికారికి వినతి
ఆదిలాబాద్‌టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌ను కోరారు. జిల్లా కేంద్రంలోని పెన్‌గంగ భవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అలాగే పదోన్నతి కల్పించాలని, సీనియారిటీ జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. ఇతర సమస్యలను విన్నవించగా, ప్రత్యేక అధికారి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇందులో సంఘం అధ్యక్షుడు పొచ్చన్న, ప్రధాన కార్యదర్శి అరవింద్, కార్యవర్గ సభ్యులు లత, మహేందర్, వెంకటగిరి తదితరులున్నారు.