
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ని ర్వహించిన నాలుగో సబ్‌జూనియర్‌రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆదిలాబా ద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. 40–43కిలోల విభాగంలో జే.నిత్యారెడ్డి స్వర్ణ పతకం, 35–37కిలోల విభాగంలో నందిని రజతం, 52–55 కిలోల విభాగంలో బీ.నిఖిల్ రజతం, 43–46 కిలోల విభాగంలో సి.వివేక్, 43–46 కిలోల విభాగంలో బత్తుల అశ్వినీ కాంస్య పతకాలతో మెరిశారు. ఇందులో నిత్యారెడ్డి ఆగస్టు 6 నుంచి 13వరకు ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో నిర్వహించనున్న జాతీ య సబ్‌జూనియర్ బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సాయి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవడంపై డీవైఎస్‌వో జక్కు ల శ్రీనివాస్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయేందర్, ఎంఏ బేగ్ తదితరులు అభినందించారు.