
ఫలించిన ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం
● రిటైర్మెంట్ ప్రయోజనాలపై హైకోర్టును ఆశ్రయించిన సీసీఐ ఉద్యోగులు ● వడ్డీతో సహా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశం
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని సీసీఐ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు చేసిన న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. సీసీఐని మూసివేస్తూ 2017లో ఉత్తర్వులు జారీ చేసిన మేనేజ్‌మెంట్ 2008 సంవత్సరం వరకే ఉద్యోగులకు రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని స్పష్టం చేసింది. అయి తే తమకు అన్యాయం జరుగుతుందని భావించిన ఉద్యోగులు సంస్థ జారీ చేసిన ఉత్తర్వులపై హై కోర్టును అదే సంవత్సరంలో ఆశ్రయించారు. అప్ప టి నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. కాగా ఉద్యోగులకు రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్ ప్రయోజనాలను 2008 నుంచే వడ్డీతో సహా చెల్లించాలని సూచిస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కా ర్యదర్శి, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ తెలిపారు. ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ శుక్రవారం సీపీఐ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.