
ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఇచ్చోడ: ప్రతీ విద్యార్థి ఆరోగ్యంపై దృష్టి సారించా లని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని ముఖరా(బి) ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడా రు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తలసేమి యాతో బాధపడుతున్న శివంగి అనే విద్యార్థినికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ చాబ్రా, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రాథోడ్‌నరేందర్, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, తహసీల్దార్ సత్యనారాయణరావు, ఎంపీడీవో సత్యానంద్, ఇచ్చోడ వైద్యాధికారి కిరణ్‌కుమార్, మాజీ సర్పంచ్ మారుతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సు భాష్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.