
లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ హెచ్‌కేజీఎన్ ఫంక్షన్ హా ల్‌లో గురువారం ఆహార భద్రత, కొత్త రేషన్ కార్డులను కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పంపి ణీ చేశారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభా రక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రే షన్ కార్డుల కల నెరవేరిందని తెలిపారు. ఉట్నూర్ కు సుమారు 2,081 రేషన్‌కార్డులు వచ్చినట్లు పేర్కొన్నారు. అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించి మంజూరు చేస్తుందని చెప్పా రు. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదు కాని వారు నమో దు చేయించుకోవాలని, కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, డీసీ సీబీ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్, సివి ల్ సప్లయ్ అధికారి వాజిద్ తదితరులున్నారు.