
ప్రజలను అప్రమత్తం చేయాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: మూడురోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజల ను అప్రమత్తం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని పోలీస్ అధికారులకు సూచనలు చేశా రు. కొత్తగా శిక్షణ పొందిన డిజాస్టర్ రెస్పాన్స్ బృందం (డీడీఆర్‌ఎఫ్) అత్యాధునిక సదుపాయాలతో 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తుందని చెప్పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నీరు ప్రవహిస్తున్న కల్వర్టులు, బ్రిడ్జిలపై ప్రజలు దాటకుండా, వాగులు, నదులు, రిజ ర్వాయర్లు, జలపాతాల వద్దకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. చేపల వేట కోసం వాగులు, చెరువులకు వెళ్లకుండా మత్స్యకారులను అప్రమత్తం చే యాలని పేర్కొన్నారు. రైతులు తడిచిన విద్యుత్ మోటార్లు, స్తంభాలు, వైర్లను ముట్టుకోకుండా, చె ట్లు, శిథిల భవనాల వద్ద ఉండకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. జలపాతాలు, చెరువులు, వాగులు, రహదారుల పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించి రాకపోకలపై నిఘా పెట్టాలని, రహదారులపై నీటి గుంతలున్న చోట హెచ్చరిక బోర్డులు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసరమైతే ప్రజలు ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.